విశాఖ: డాక్ యార్డ్ ఉద్యోగులకు అండగా ఉంటా

ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు డాక్ యార్డ్ ఉద్యోగుల సంక్షేమానికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం డాక్ యార్డ్ కేటీబి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి సత్కరించారు. అసోసియేషన్ చేపట్టిన ఉపకార వేతనాల పంపిణీ, ఉచిత వైద్య శిబిరాల వంటి సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యేకు వివరించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సంఘాల్లో డాక్ యార్డ్ అసోసియేషన్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం అభినందనీయమని గణబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్