విశాఖ‌: ఆగస్టులో షాంఘైలో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

చైనాలోని షాంఘై నగరంలో ఆగస్టు 24, 25 తేదీల్లో 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరగనుంది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, షాంఘై తెలుగు సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులను ఆహ్వానించారు. లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈ విషయాన్ని తెలిపారు. సొంత ఖర్చులతో వచ్చే ప్రతినిధులకు స్థానిక వసతి, ఆతిథ్యం ఉచితంగా అందిస్తారు, అయితే వీసా, ప్రయాణ ఏర్పాట్లు వారే చేసుకోవాలని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్