విశాఖలోని జగదాంబ సెంటర్‌లో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తి కొట్టి, బూతులు తిట్టాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై మహిళ సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేయగా, YCP ఆ వీడియోను షేర్ చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దాడి జరుగుతున్నప్పుడు అక్కడున్న వారు ఎవరూ పట్టించుకోలేదని మహిళ కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడ ఉన్నవారు ఎవరు పట్టించుకోలేదని మహిళలపై దాడులు జరిగినప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నవారు అండగా నిలవాలని కోరారు.