నిర్మాణంలో ఉన్న భవనంపైనుంచి పడి కార్మికుడు మృతి

విశాఖలోని వాడపాలెంలో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ కార్మికుడు మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ ఘటనలో మృతుడు పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలానికి చెందిన వసంతల ఈశ్వరరావు (52)గా గుర్తించారు. ఏడాదిగా నిర్మాణ భవనంలో నివసిస్తున్నట్లు తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటనపై పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్