విశాఖపట్నం ఆర్కే బీచ్‌లోని సుప్రీం హోటల్ ఎదురుగా అనుమానాస్పద స్థితిలో ఎం. శ్రీధర్ (36) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో, మృతుడు జగదాంబ సమీపంలో నివాసం ఉండే కార్ మెకానిక్ శ్రీధర్ అని పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి బీచ్‌లో రాళ్ల మధ్య యువకుడు విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.