అచ్చుతపురం, రాంబిల్లి మండలాలలో మట్టి మాఫియా కొండలు, చెరువులు, ఏపీఐఐసీ, ప్రభుత్వ స్థలాల్లో విచ్చలవిడిగా మట్టిని తరలించిపోయి సొమ్ము చేసుకుంటున్నారని సీపీఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్. రాము , కమిటీ సభ్యులు కె. సోమునాయుడు అన్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో మట్టి మాఫియాకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని పేద, అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.