వెదురువాడకు చెందిన వియ్యపు నర్సింగరావుకు ఒక్కసారిగా రూ.8175 విద్యుత్ బిల్లు రావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. జనవరిలో మీటర్ మారే వరకు నెలకు రూ.300 చొప్పున బిల్లు వచ్చేదని, ఇప్పుడు భారీగా బిల్లు పంపారని చెబుతున్నాడు. అధికారులు ముందుగా రూ.550 చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు కానీ ఇప్పుడు కనెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారన్నాడు.