అచ్యుతాపురం: ఈ నెల 16న విద్యుత్ సరఫరాకు అంతరాయం

అచ్యుతాపురం మండలంలో పలు గ్రామాలకు ఈనెల 16న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ రాజశేఖర్ సోమవారం తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెదురువాడ, జి. ధర్మవరం, ఎల్. ధర్మవరం, ఎం. ధర్మవరం, మార్టూరు రోడ్డు, దిబ్బపాలెం, భోగాపురం, అచ్యుతాపురం, మోసయ్య పేట తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్