ఎలమంచిలి: ధర్మశ్రీని సత్కరిస్తున్న కన్నబాబురాజు

ఎలమంచిలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియామకమైన మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ శనివారం ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే యు.వి కన్నబాబురాజును మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఎలమంచిలి సమన్వయకర్తగా జగన్ నియమించారని చెబుతూ ఆయన్ని సత్కరించారు. దీంతో స్వాగతించిన కన్నబాబురాజు ధర్మశ్రీని సత్కరించి పార్టీ అభివృద్ధిపై ఇరువురు చర్చించుకున్నారు.

సంబంధిత పోస్ట్