అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సమగ్ర శిక్షణ ఏపీసీ చంద్రశేఖర్ అన్నారు. గురువారం గొల్లలపాలెం కేజీబీవీలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన ఆయన, ఉపాధ్యాయులు నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని సూచించారు.