ఉపాధి హామీ పనులపై బీంపోలులో సామాజిక తనిఖీ గ్రామసభ

అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, బీంపోలు పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై సర్పంచ్ జన్ని బీమ్మలమ్మ అధ్యక్షతన సామాజిక తనిఖీ గ్రామసభ జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 165 పనులకు వేతనాలు, మెటీరియల్ రూపంలో రూ.1,67,55,237 ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో వారం రోజుల పాటు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించిన అనంతరం, సోషల్ ఆడిట్ డిఆర్పి పాంగి రాజు గ్రామసభలో గుర్తించిన అంశాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మహాలక్ష్మి, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్