ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడామైదానంలో శుక్రవారం అంతర్ జిల్లాల హాకీ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో అనకాపల్లి జిల్లా జట్టు 9-2 గోల్స్ తేడాతో చిత్తూరు జట్టుపై ఘన విజయం సాధించింది. ఈ విషయాన్ని జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే. నరేష్ తెలిపారు. పోటీల్లో భాగంగా సాయంత్రం 4 గంటలకు ప్రకాశం జిల్లా జట్టుతో అనకాపల్లి జట్టు తలపడనుంది.