అతి తక్కువ ధరకే ఇంటర్నెట్

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఫైబర్ ద్వారా అందజేస్తుందని ఏపీ ఫైబర్ విశాఖ జిల్లా ప్రతినిధి మోహన్ రావు అన్నారు. మంగళవారం యలమంచిలి కేబుల్ కార్యాలయం వద్ద ఆపరేటర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ధరకు ఇంటింటా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 190 రూపాయలతో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ పంపించే విధంగా ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. నేటి విద్యా విధానంలో ఇంటర్నెట్ ప్రాధాన్యత ఎంతైనా ఉందన్నారు. కేబుల్ ఆపరేటర్ రోజు అందుబాటులో ఉండాలన్నారు. ఇంటర్నెట్ ఉండడం వల్ల వ్యాపారులకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ ప్రతినిధి యశ్వంత్, ఆపరేటర్లు జానకిరామ్, హాయ్ రాo, సుందరపు బాబ్జి, శర్మ, నూకరాజు, నానాజీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕