యలమంచిలి మున్సిపాలిటీలో వీలనమైన కొక్కిరాపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీ నుండి తప్పించాలని కోరుతూ మున్సిపల్ ఛైర్పర్సన్ రమా కుమారికి, మున్సిపల్ కమీషనర్ ప్రసాద్ కి వినతి పత్రం అందించారు. శుక్రవారం యలమంచిలి మున్సిపాలిటీ 23 వార్డ్ కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ ఆధ్వర్యంలో అందించగా, ఈ నెల కౌన్సిల్ సమావేశంలో దీనిపై తీర్మానం ప్రవేశపెట్టాలని సూచించారు. మున్సిపాలిటీకి 8కి.మీ దూరంలోని గ్రామంలో ఎలాంటి అభివృద్ది జరగడం లేదన్నారు.