ఎస్.రాయవరం మండలానికి చెందిన దివ్యాంగుడు బాజ్జి కుటుంబానికి హోం మంత్రి వంగలపూడి అనిత అండగా నిలిచారు. ఇటీవల నక్కపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి వచ్చిన బాజ్జిని చూసిన మంత్రి పీ4 కింద ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. గురువారం రెండు జెర్సీ ఆవులు అందజేశారు. అలాగే బాజ్జి కుమారుడు రూపేష్ చదువుల ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చారు.