అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భర్తకు బెయిల్ రావడంలేదన్న మనస్తాపంతో భార్య కురుపాటి రజనీకుమారి (54) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. భర్త వెంకటనాగ సత్యగోపాల్ రాజు ఒక కేసులో రిమాండ్ ఖైదీగా విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఎనిమిది నెలలుగా బెయిల్ రాకపోవడంతో ఒంటరితనం భరించలేక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. తల్లి స్పందించకపోవడంతో కుమారుడు అపార్ట్మెంట్ కాపలాదారుడికి ఫోన్ చేయగా, ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిన రజనీకుమారి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.