యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో పెద్దపెల్లి, పోలవరం కాలువ వద్ద గత కొన్నేళ్లుగా పిలిచిపోయిన నిర్మాణం పనులు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో, ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆదేశాలతో శరవేగంగా జరుగుతున్నాయి. పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రాజెక్టు మేనేజర్ త్రినాథ్ తెలిపారు. సీనియర్ ప్రాజెక్టు మల్లేశ్వరరావు, కన్స్ట్రక్షన్ మేనేజర్ సింహాచలం మారిపిరెడ్డి రమణ సమక్షంలో పనులు జరుగుతున్నాయి. వంతెన రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.