యలమంచిలిలోని రైల్వే స్టేషన్ రోడ్‌లో ఉన్న జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు చార్టెర్డ్ అకౌంటెంట్ బండారు బంగారు శెట్టి శుక్రవారం సుమారు రూ. 18,000 విలువైన పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, ఫ్లాంక్స్, స్టేషనరీ అందజేశారు. అలాగే ప్రతిరోజు గ్రంథాలయానికి తెలుగు, ఆంగ్ల దినపత్రికలు వేయిస్తానని, పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ 5,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త బండారు వీరభద్రుడు, వాసవి మహిళా క్లబ్ సభ్యులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.