పెళ్లి బట్టల్లోనే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్

AP: అనకాపల్లి జిల్లా, రావికమతం మండలం చినపాచిల గ్రామంలో ఓటర్లు తమ బాధ్యతను చాటుకున్నారు. వివాహ వేడుకలో భాగంగా పెళ్లి పీటల మీద ఉండగానే, నవ వరుడు కె. గౌరినాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి దుస్తుల్లో, తల మీద జీలకర్ర బెల్లంతోనే నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఆయన వ్యవహరించిన తీరును చూసి పలువురు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕