AP: రాష్ట్రంలో నేతన్నలకు శుభవార్త. ఆప్కోకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాల్లో పనిచేసే నేత కార్మికులకు వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సవిత తెలిపారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వేతనాల పెంపు కారణంగా ఒక్కో నేత కార్మికుడికి నెలకు అదనంగా రూ.3 వేల ఆదాయం వస్తుందన్నారు. ఈ నిర్ణయంతో సుమారు 89 వేల మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతుంది.