పవన్ కోసం ఎదురుచూపులు.. జనసేనలో చర్చ!

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించినప్పటికీ.. 18వ తేదీ వచ్చినా పవన్ అక్కడికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం చికిత్స కోసం కేరళకు వెళ్లిన పవన్.. సెప్టెంబర్ 12న కేరళ పర్యటన ముగిసినట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో.. పవన్ ఎప్పుడు మంగళగిరి కార్యాలయానికి వస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕