బీటెక్, ఎమ్మెల్సీ రాంగోపాల్‌ వర్గాల మధ్య వార్‌

AP: పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్ వర్గాల మధ్య అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ఘర్షణ చోటుచేసుకుంది. బీటెక్ రవి వర్గీయులు విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు చేస్తుండగా, రాంగోపాల్ వర్గీయులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ కార్యకర్త జయచంద్రారెడ్డి, తనకు ప్రభుత్వం నుంచి అనుమతితో క్వారీ ఉన్నా బీటెక్ వర్గీయులు గ్రావెల్ అమ్మకాన్ని అడ్డుకుంటున్నారని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్