AP: ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్‌లో రాత్రి చలికి తట్టుకోలేక దుప్పటి అడిగిన 8వ తరగతి విద్యార్థిని అక్షయను వార్డెన్ ఇంటికి పంపించారు. చలిలో వణుకుతూ బయటకు వచ్చిన విద్యార్థినిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. వార్డెన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో వార్డెన్‌పై చర్యలకు డిమాండ్లు పెరుగుతున్నాయి.