అమరావతిని ప్రపంచ దేశాలు తలతిప్పి చూసేలా నిర్మిస్తున్నాం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు వేగవంతం చేస్తూ నూతన ప్రణాళికలు సిద్ధం చేశారు. అమరావతి ప్రణాళికలో అంతర్జాతీయ విమానాశ్రయం, బుల్లెట్ రైలు, ఏఐ (AI) సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేర్చారు. 600 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు, 4-లైన్ల రైల్వే ట్రాక్, ఎక్స్‌ప్రెస్ హైవేలు, కృష్ణా నదిపై కొత్త వంతెనల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అమరావతిని సింగపూర్ తరహాలో ప్రపంచమే తలతిప్పి చూసే నిరంతర అభివృద్ధి ఐకాన్‌గా తీర్చిదిద్దుతామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕