AP: మొంథా తుఫాన్ ప్రభావం ఏపీపై తీవ్రంగా పడింది. ఇవాళ కృష్ణా జిల్లా అవనిగడ్డలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ముందు జాగ్రత్తతో తుఫాను వల్ల అధిక నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. వర్షాల కారణంగా 46వేల హెక్టార్లలో వరి, 14వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. తుఫాను బాధితులకు బియ్యం ఫ్రీగా ఇస్తున్నామని, పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ఒక్కో కుటుంబానికి రూ.3వేలు అందిస్తున్నామని తెలిపారు.