చంద్రబాబు అనుభవం ఏంటో చూస్తున్నాం: పవన్‌

AP: సీఎం చంద్రబాబు అనుభవం ఏంటో ఈ విపత్తు సమయంలో చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గతంలో హుద్‌హుద్‌ తుఫాన్ సమయంలోనూ చంద్రబాబు ముందుచూపు చూశామని, ఇప్పుడూ ఆయన నిరంతరం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సీఎంను అభినందించాల్సిన సమయంలో విమర్శలు సరికాదని వైసీపీకి చెబుతున్నానన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా తేలిక.. కానీ పని చేసేవాళ్లకే కష్టం తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్