AP: విజయవాడ ఉత్సవ్ 2.0 నిర్వహిస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. వచ్చే నెల 11 నుంచి 22వ తేదీ వరకు పున్నమి ఘాట్, బసవ పున్నయ్య స్టేడియంలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఏర్పాట్లు ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పంపినట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.