మాజీ సీఎం జగన్ పర్యటనలో భద్రత కల్పిస్తున్నప్పటికీ.. వైసీపీ నాయకులు డ్రామాలాడుతున్నారని మంత్రి లోకేష్ అన్నారు. భద్రత కల్పిస్తే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు సీఎం కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని.. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.