AP: స్థానిక సంస్థల ఎన్నికలపై శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘స్థానిక ఎన్నికలు జరగాలని వైసీపీ కోరుకుంటోంది. ఎన్నికలు వస్తే ఈ క్షణమే మేము సిద్ధంగా ఉన్నాము. కానీ SIR ప్రక్రియలో జరిగే తప్పులపై సమాధానం చెప్పాలని కోరుతున్నాం’ అని అన్నారు.