AP: స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో మంచి భోజనం పెడుతున్నామని మంత్రి లోకేశ్ అన్నారు. ‘కడపలో 5 స్మార్ట్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. హెడ్ కుక్స్, అసిస్టెంట్ కుక్స్, హెల్పర్లు, డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తున్నాం. స్మార్ట్ కిచెన్లలో వేల మందికి ఉపాధి కల్పిస్తుంటే జగన్‌కు బాధ ఎందుకు? మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే జగన్ తట్టుకోలేకపోతున్నారు’ అని మంత్రి లోకేశ్ అన్నారు.