త్వరలో 700 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం: చంద్రబాబు

AP: రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను సమర్థంగా అమలు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలో 700 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉగాది రోజున మరో 5 లక్షల గృహప్రవేశాలు ఉంటాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించి నిజమైన సంక్రాంతి కానుక ఇచ్చామన్నారు. దేశంలోకి వచ్చిన పెట్టుబడులో 25 శాతం రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రధాని మోదీ నాయకత్వానికి పూర్తిగా సహకరిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్