ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెం పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో ఇంటింటికీ పింఛన్లు అందిస్తున్నామని, 28 కేటగిరీలకు వీటిని అందజేస్తున్నామని తెలిపారు. తాను ప్రజల్లో ఉండే వ్యక్తిని అని, పేదల జీవితాల్లో శాశ్వత వెలుగు తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు. సమాజంలో ఉన్న పది శాతంమంది పేదలకు అండగా ఉండాలని సూచించారు. ఒక నెలలో తీసుకోకపోయినా, మూడు నెలలకు ఒకేసారి పింఛన్ ఇస్తున్నామని, దీనికోసం ఏటా 33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.