AP: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము తలుచుకుంటే వైసీపీ నేతలు గేటు కూడా దాటలేరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ పర్యటనల్లో ఆంక్షలపై కూటమి ప్రభుత్వం, పోలీసులపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. వైఎస్ జగన్‌కు గౌరవం ఇచ్చి పర్యటనలకు అనుమతిస్తున్నామని చెప్పారు. పెద్దిరెడ్డి మీద కక్షతోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.