AP: వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐసీయూలోకి తీసుకువచ్చామని మంత్రి నిమ్మల రామానాముడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సూపర్ సిక్స్ నెరవేరుస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.