నకిలీ మద్యం కేసులో మా ప్రమేయం లేదు: జోగి రమేశ్ కొడుకు (వీడియో)

AP: నకిలీ మద్యం కేసులో తమ ప్రమేయం లేదని జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అన్నారు. చంద్రబాబు, లోకేశ్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ అరెస్టులు జరుగుతున్నాయని, అక్రమ అరెస్టులు ఎల్లకాలం సాగవని ప్రభుత్వ పెద్దలు గుర్తుంచుకోవాలని రాజీవ్ హెచ్చరించారు. గత ఏడాది తనను, ఇప్పుడు తన తండ్రిని అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. అరెస్ట్ చేసినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదని చెప్పారు.

సంబంధిత పోస్ట్