జ‌న‌సేన వ‌ల్ల మాకు ఒరిగిందేమీ లేదు: కార్యకర్త కన్నీటి ఆవేదన

AP: జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఓ జనసైనికుడు కన్నీటి ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన వల్ల తమకు ఒరిగిందేమీ లేదని ఆయన ఆవేదన చెందారు. పార్టీ చాలా క్రిటికల్ పొజిషన్‌లో ఉందని, రాష్ట్రం మొత్తం మీద కష్టపడిన కార్యకర్తలను తరిమి వేయడానికి ఒక టీమ్‌ను పెట్టినట్టుగా ఉందని ఆరోపించారు. ఉద్యోగం మానేసి పార్టీ కోసం తిరిగి పదేళ్ల టైమ్‌ను వేస్ట్ చేశామని, రెండు ఎన్నికలకు ఆర్థిక సాయం కూడా చేశామని తెలిపారు. పార్టీ అధినేత సమాజానికి ఏదైనా చేయండి, మాకు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్