చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చాలా దరిద్రమైన పని అని ఆయన ఆరోపించారు. 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవని అన్నారు. అయితే తాము మూడేళ్లలో 17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించామని, కానీ చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదని జగన్ పేర్కొన్నారు.