ఏపీ పోలీసు అధికారులకు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. ‘వైసీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టడం అసాంఘిక చర్య. మంత్రి లోకేశ్ చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారు. ఐపీఎస్ అధికారులు మణికంఠ, సర్వ శ్రేష్ఠ్ త్రిపాఠి, హరీశ్ కుమార్ ఓ గ్రూప్‌గా చేరి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. అందరిపై కేసులు పెడతాం. కోర్టులో మీ సంగతి తేలుస్తాం. లోకేశ్ రాజ్యం ఎన్నాళ్లు నడుస్తుందో చూస్తాం’ అని మండిపడ్డారు.