AP: గడిచిన ఎన్నికల్లో తాము ఘోరంగా ఓడిపోయామని, ప్రస్తుతం జేబులు ఖాళీ అయ్యాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయాన్ని ఓటర్లు అర్థం చేసుకుని స్థానిక ఎన్నికల్లో తమను ఆదరించాలని కోరారు. ఆర్గానిక్ పంటల మాదిరిగానే ఇవి తమకు ఆర్గానిక్ ఎన్నికలని వ్యాఖ్యానించారు. గెలిపిస్తే న్యాయమైన పాలన అందిస్తామని తెలిపారు. గుంటూరులో నిరుపేద ఆర్యవైశ్య మహిళను మేయర్ అభ్యర్థిగా నిలిపామని, ఆమెకు నోటుతో పాటు ఓటు కూడా ఇవ్వాలని ఓటర్లను కోరారు.