ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే రూల్స్ మాకూ కావాలి: సచివాలయ ఉద్యోగులు

ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న రూల్స్ అన్నీ తమకూ వర్తింపజేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కోటేశ్వరరావు అన్నారు. 'రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. రావాల్సిన బకాయిలను మంజూరు చేయాలి. ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టేంట్ పే స్కేల్ కల్పించాలి. ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలి. యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాలి' అని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్