ఏపీని చూసి పొరుగు రాష్ట్రాలు అసూయపడే రోజు తీసుకొస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ‘డీఎస్సీపై ప్రతిపక్షం అనేక విధాలుగా మాట్లాడింది. 150 రోజుల్లో డీఎస్సీ నిర్వహించి నియామకాలు చేపట్టాం. రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం. పిల్లల భవిష్యత్ కోసం సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారు’ అని అన్నారు.