అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

AP: అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సమస్య పరిష్కారంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ అంశంపై ఇప్పటికే మూడు సమావేశాలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులైన డిపాజిటర్లకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన సుమారు 20 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని, అందులో 6 వేల ఎకరాలకు పైగా భూమిని వేలం వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్