AP: వైసీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబుపై జరిగిన దాడిని ఖండించారు. టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి గందరగోళం సృష్టించాయని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలు లోపించాయని, కూటమి ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ పరిణామాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరతామని తెలిపారు.