AP: రాష్ట్రంలో పేదలకు శుభవార్త. ఉగాదిలోగా మరో ఐదు లక్షల ఇళ్లను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం, మంత్రులు కష్టపడి పని చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. టెక్నాలజీ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటున్నామని మంత్రి వెల్లడించారు.