రౌడీయిజం చేసేవారి తోక కత్తిరిస్తాం: చంద్రబాబు

AP: విజయవాడలో స్పోర్ట్స్ కోటా టీచర్లపై YCP నేతలు దాడి చేయడాన్ని CM చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. 'రౌడీలు గురువులపై దాడి చేస్తున్నారు. టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం, చర్యలు తీసుకుంటాం. సాక్షి రిపోర్టర్ టీచర్‌పై దాడి చేశారంటే YCP ఎంత బరితెగించిందో అర్థం చేసుకోండి. అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే సాక్ష్యాధారాలతో నోళ్లు మూయిస్తాం. చట్టబద్ధ ప్రక్రియపై కోర్టుకు వెళ్లొచ్చు కానీ దాడులేంటీ? ఉపాధ్యాయులపై రౌడీలను ఎగదోయడమేంటి? రౌడీయిజం చేసేవారి తోక కత్తిరిస్తాం' అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕