మాగుంట వ్యాపారాలు అన్నీ బయటపెడతాం: చెవిరెడ్డి

AP: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో తప్ప మాగుంటకు ప్రజలు గుర్తుండరని, ఎంపీ పదవిని అడ్డుపెట్టుకుని ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టును నిర్మించి నీళ్లు తెచ్చిన ఘనత వైఎస్సార్, జగన్‌లకే దక్కుతుందని స్పష్టం చేశారు. సొంత వ్యాపార ప్రయోజనాల కోసమే మాగుంట దిగజారి మాట్లాడుతున్నారని, ఆయన వ్యాపారాలన్నీ త్వరలోనే బయటపెడతామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్