వైసీపీ అక్రమాలన్నింటినీ బయటకు తీస్తాం: మంత్రి రవీంద్ర

AP: వైసీపీ అక్రమాలన్నింటినీ బయటకు తీస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైఎస్ జగన్‌ డేటా సెంటర్‌ అంటే ఏంటో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని నాసిరకం బ్రాండ్లు అమ్మిన జగన్‌కు.. మద్యం గురించి నీతులు మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు. విజయవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమినేతల సమన్వయ కమిటీ సమావేశం ఆయన పైవిధంగా మాట్లాడారు.

సంబంధిత పోస్ట్