ప్రతి హామీ నెరవేర్చి తీరుతాం: బాబు

‘జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పాలనంతా గాడి తప్పింది. ఖజానాలో చిల్లిగవ్వ లేదు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. వడ్డీనే రూ.లక్ష కోట్లు అవుతోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇటుక ఇటుక పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేంత వరకు ఓ సైనికుడిలా పని చేస్తానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్