AP: వైసీపీ నేతలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక సూచనాలు చేశారు. ఏలూరులో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మనం జనం బలంతో వెళ్తాం. మనం చేసిన సంక్షేమం, అభివృద్ధితో వెళ్తాం. ఈ కష్టకాలంలో పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తుంచుకుంటుంది. గెలిచినా.. ఓడినా జగనన్న వెంట ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయండి. అధికారం చూసి పారిపోయే అభ్యర్థులు మనకు వద్దు’ అని అన్నారు.