పొరుగు రాష్ట్రాలు అసూయపడేలా చేస్తాం: మంత్రి లోకేష్

AP: సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి దిశగా వేగంగా దూసుకుపోతుందని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. త్వరలోనే ఏపీని చూసి పొరుగు రాష్ట్రాలు అసూయపడే రోజు వస్తుందని అన్నారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురమే అని పేర్కొన్నారు. 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్